మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన విచారణ పారిశ్రామికవేత్త ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి విచారణ పూర్తయింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుధీర్ఘంగా విచారించారు. నిందితుడు రాకేష్ రెడ్డి జయరామ్‌తో ఏ విధంగా పరిచయం..? అతను నాలుగు కోట్లు జయరామ్‌కు వాస్తవంగానే ఇచ్చాడా...? హత్యలో రాకేష్‌తో పాటు ఎవరెవరి ప్రమేయం ఉంది..? అనే కోణాల్లో ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ప్రస్తుతం తానేమి మాట్లాడనని శిఖా చౌదరి జవాబిచ్చారు.