భర్త, అతని స్నేహితులతో కలిసి... తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ ఓ గృహిణి ఏపీలోని గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నగరంలోని ఏటీ అగ్రహారానికి చెందిన మహిళతో బెంగళూరుకు చెందిన వ్యక్తికి ఏడేళ్ల కిందట వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య స్పర్థలు రావడం వల్ల విడిగా ఉంటున్నారు. కొద్దిరోజుల కిందట అతను గుంటూరు వచ్చినట్లు తెలుసుకున్న సదరు మహిళ, బంధువులు వెళ్లి అతనితో మాట్లాడే క్రమంలో గొడవ జరిగింది.
భార్య, ఆమె తరఫు బంధువులు తనపై దాడిచేశారంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 17న సదరు మహిళ.. తన భర్త వద్దకు వెళ్లింది. కాపురానికి తీసుకువెళ్లాలని అడగాలనుకుంది. కానీ.. అక్కడ మద్యం తాగుతున్న భర్త, తన స్నేహితులతో కలిసి సామూహికంగా అత్యాచారం చేశారని ఫిర్యాదు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మల్లికార్జునరావు చెప్పారు.
ఇదీ చదవండి: తాండూరు ఐబీలో చోరీ.. బంగారం, వెండి మాయం