ETV Bharat / jagte-raho

ఆత్మహత్య: ఆర్థిక ఇబ్బందులా..? వివాహేతర సంబంధమా..? - భర్త ఆత్మహత్య వార్తలు యాదాద్రి జిల్లా

వివాహేతర సంబంధాలు నిండు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు బతకాల్సింది పోయి.. వేరు, వేరు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీంతో కుటుంబాల్లో కలహాలు చెలరేగి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి ఘటనే యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కాశగూడెంలో చేటుచేసుకుంది.

ఆత్మహత్య: ఆర్థిక ఇబ్బందుల..? వివాహేతర సంబంధమా..?

author img

By

Published : Nov 21, 2020, 11:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కాశగూడానికి చెందిన ఎస్కే యాకూబ్, యాకూబీ భార్యాభర్తలు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. గత కొంత కాలంగా భార్యా భర్తలిద్దరికి వేరే వారితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తరచూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ నేపథ్యంలో భర్త పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని గ్రామస్థులు తెలిపారు.

ఈ నెల 16న మనోవేదనకు గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్​ ఉస్మానియా ఆసుత్రికి తరలించారు. అయితే చికిత్స పోందుతూ శుక్రవారం యాకూబ్​ మృతి చెందాడు. యాకూబ్ ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని బంధువులు ఆందోళన చేపట్టారు.

గూడెం పెద్ద మనుషులు.. బంధువులకు సర్ది చెప్పడం వల్ల ఆందోళన విరమించి అంతిమ సంస్కారాలు చేశారు. యాకూబ్​ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై.. చేసేందుకు పని దొరక్క మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై ఉదయ్​ కిరణ్​ తెలిపారు. మృతుని దగ్గరి బంధువు ఎస్కే సయ్యద్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.

ఇదీ చదవండి: 'నా తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. రక్షణ కల్పించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.