ETV Bharat / jagte-raho

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య - మేడ్చల్​లో భర్త హత్య

మేడ్చల్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని సైదొనిగడ్డ తండాలో మే నెలలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడి భార్యతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.

husband murder with illegal affair in medchal
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య
author img

By

Published : Jun 30, 2020, 3:33 PM IST

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిన ఘటన... మేడ్చల్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని సైదొనిగడ్డ తండాలో మే నెలలో చోటుచేసుకుంది. మృతుడి భార్యతోపాటు నలుగురు అనుమానితులను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించినట్టు పేట్​ బషీర్​బాద్​ ఏసీపీ నర్సింహారావు తెలిపారు.

మేడ్చల్ మండలం సైదొనిగడ్డ తండాకు చెందిన సురేష్ భార్య బబిత, దుండిగల్​ తండాకు చెందిన ప్రేమ్​ సింగ్​కు మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న బబిత... ప్రియుడుతో చెప్పింది. ప్రేమ్​సింగ్​ తన స్నేహితులు రాహుల్, రాజు, అజ్మీర్​ ప్రేమ్​తో కలిసి పథకం పన్నాడు.

పథకం ప్రకారం మే 23న కారులో వెళ్తున్న సురేష్​ను డీసీఎంతో ఢీ కొట్టారు. ఆసుపత్రికి తరలిస్తున్నట్టు నటించి, దారిలో గొంతు నులిమి చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అందరినీ నమ్మించారు. కానీ సురేష్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా... విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.