ETV Bharat / jagte-raho

భార్య గొంతు కోసి కాలువలో పడేసి...

భార్యపై అనుమానం పెంచుకున్నాడా భర్త.. ఇంట్లోనే ఇల్లాలి గొంతు కోసి హత్య చేసి.. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి తెలుగు గంగ కాలువలో పడేశాడు. మూడు రోజుల క్రితం ఏపీ కడప జిల్లా చిన్నాయ పల్లెలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది.

husband-kills-wife-in-chinnaya-palli-at-kadapa-district
దారుణం: గొంతు కోసి చంపి.. తెలుగు గంగ కాలువలో పడేసి...
author img

By

Published : Nov 5, 2020, 4:11 PM IST

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా కాశినాయన మండలం చిన్నాయపల్లెలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా గొంతు కోసి ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టేసి తెలుగు గంగ కాలువలో పడేశాడు.

గ్రామానికి చెందిన పుల్లారెడ్డికి నారాయణమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అంత్తారింటికి పంపించారు. ఇద్దరు మగ సంతానం చదువుకుంటున్నారు.

అనుమానంతో తరచూ భార్య నారాయణమ్మతో గొడవ పడే పుల్లారెడ్డి... మూడు రోజుల క్రితం కూడా ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి సమీపంలో ఉన్న తెలుగు గంగ కాలువలో పడేశాడు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: వైద్యులు చికిత్స అందించట్లేదని రోగి ఆత్మహత్య..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.