ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పామిడి మండలం నెమలపల్లి గ్రామానికి చెందిన సుబ్బారాయుడు... 11 నెలల క్రితం ఉరవకొండ మండలం వజ్రకరూరు గ్రామానికి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. నెల క్రితం తనకు ద్విచక్రవాహనం కొనివ్వాలంటూ అత్తింటి వారిని కోరాడు. తమకు అంత స్తోమత లేదని, ప్రస్తుతానికి కొనివ్వలేమని వారు చెప్పడంతో కోపోద్రిక్తుడైన సుబ్బారాయుడు లక్ష్మితో గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో కోపంతో లక్ష్మి గొంతుపై కాలితో తొక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకుడు సుబ్బరాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచదవండి.