ETV Bharat / jagte-raho

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త - అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Medchal district latest news
Medchal district latest news
author img

By

Published : May 26, 2020, 10:38 PM IST

భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన మేడ్చల్​ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్​లోబంగారం పని చేసే సతీశ్​... భార్య జయలక్ష్మిపై అనుమానంతో సోమవారం రాత్రి బంధువుల ఇంటి వద్ద ఉన్న భార్యపై బండరాయితో దాడిచేసి హతమార్చాడు.

బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నుంచి 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్​ నగరానికి కుటుంబంతో సతీశ్ వలస వచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సతీశ్ మియాపూర్​లో గోల్డ్ స్మిత్ పనులు నిర్వహిస్తుండగా, భార్య జయలక్ష్మి నిజాంపేట్ హిల్ కౌంటీ కాలనీలో సెక్యూరిటీ సూపర్​వైజర్​గా పనిచేస్తుంది. గత కొంత కాలంగా భార్యపై అనుమానంతో సతీశ్​... భార్యతో తరచూ గొడవ పడేవాడు.

సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో భార్య జయలక్ష్మి రాజీవ్ గాంధీ నగర్​లోని బంధువుల ఇంటి వద్ద ఉండగా మద్యం సేవించి సతీశ్​ అక్కడికి వెళ్లాడు. మద్యం మత్తులో ఊగిపోతూ నిద్రిస్తున్న జయలక్ష్మిపై బండరాయితో దాడిచేయగా తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సతీశ్​ పరారీలో ఉన్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.