ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం చినకంచర్ల గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను తీవ్రంగా గాయపరిచాడు. గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన నాగేశ్వరరావు.. భార్య సువార్త తీరుపై అనుమానం వ్యక్తం చేసేవాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని తెలిపారు.
ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న అతను ఇనుప కడ్డీతో భార్య తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన సువార్తను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కొంత విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఇంటి చుట్టూ విద్యుత్ తీగలు అమర్చి.. హత్యకు యత్నం