ETV Bharat / jagte-raho

క్షణివేకాశంలో భార్యను హతమార్చిన భర్త అరెస్ట్​

కట్టుకున్న భార్యను కడదాక కాపాడాల్సిన భర్త క్షణివేశంలో విచక్షణ మరచిపోయాడు. కోపంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి... భార్య మృతి చెందింది. లాలించే తల్లి ప్రాణాలు కోల్పోగా... పాలించాల్సిన తండ్రి కటకటాలపాలయ్యాడు. ఫలితంగా వారిద్దరి పిల్లలు అనాథలుగా మిగలాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన నిర్మల్​ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Husband arrested for killing
క్షణివేకాశంలో భార్యను హతమార్చిన భర్త అరెస్ట్​
author img

By

Published : Nov 19, 2020, 9:04 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన పెంటమ్మి (28), సాయిలు భార్యాభర్తలు. వీరికి ఏడేళ్ల కుమారుడు, అయిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం నిర్మల్ పట్టణంలో నివాసముంటూ స్థానికంగా కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెంటమ్మ సమయానికి వంట చేయడం లేదని, తనతో పాటు కూలీపనులకు రావడం లేదని, ఇతరత్రా చిన్నచిన్న కారణాలతో తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం మత్తులో భార్యపై దాడికి పాల్పడ్డాడు.

కర్రతో కొట్టడంతో ఆమె తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడిన సాయిలు అక్కడ్నుంచి పారిపోయాడు. ఈలోపు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయం వివరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. కోపంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఇద్దరు పిల్లల భవితవ్యం అంధకారంలో పడే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఆవేశం అదువులో ఉంచుకోవాలని, లేకపోతే కుటుంబాలు దెబ్బతింటాయన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఎన్.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి : పేరుండి ఇక్కడ లేని వారి వివరాలు ఇవ్వాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.