రంగారెడ్డి జిల్లా మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల కోసం వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సినీనటుడు శివబాలాజీ ఈనెల 14న ఫిర్యాదు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కమిషన్ స్పందించింది.
సమగ్ర విచారణ చేపట్టిన మానవ హక్కుల కమిషన్.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని.. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసింది. మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం వేధింపులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇదీ చదవండిః ఆన్లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివ బాలాజీ