ETV Bharat / jagte-raho

హేమంత్‌ హత్య కేసు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు - తెలంగాణ నేర వార్తలు

పోలీస్​ కస్టడీలో హేమంత్‌ హత్య కేసు నిందితులు

author img

By

Published : Sep 30, 2020, 1:27 PM IST

Updated : Sep 30, 2020, 2:29 PM IST

13:22 September 30

పోలీస్​ కస్టడీలో హేమంత్‌ హత్య కేసు నిందితులు

    సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో జైల్లో ఉన్న నిందితులు... అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేందర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా రెండు రోజులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించిన పోలీసులు.. ప్రస్తుతం ప్రధాన నిందితులుగా ఉన్న లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిని విచారించనున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని ఈ కేసులో ఏ ఒక్కరికి సంబంధం ఉన్నా ఎవరిని వదిలిపెట్టేది లేదని సీపీ పేర్కొన్నారు.  

హేమంత్​ ఇంటి వద్ద భద్రత

    సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను హేమంత్ కుటుంబ సభ్యులు కలిశారు. హేమంత్ కుటుంబ సభ్యులకు, తనకు ప్రాణహాని ఉందని అవంతి... సీపీకి విన్నవించుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. హేమంత్​ కుటుంబ సభ్యుల వినతిపై స్పందించిన సీపీ సజ్జనార్​... హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.  

ఇదీ చూడండి: హేమంత్ హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ

Last Updated : Sep 30, 2020, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.