భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు భారీస్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. రెండు వాహనాల్లో 1256 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ రూ.కోటి 88 లక్షల విలువ ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
ఛత్తీస్గఢ్ -ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో భద్రాచలం కేంద్రంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఏఎస్పీ వెల్లడించారు. ప్రతిరోజు ప్రత్యేక నిఘా ఉంచి వాహనాల తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. యువత సులభంగా డబ్బు సంపాందించాలనే దురుద్దేశ్యంతో గంజాయి రవాణాకు తెర తీశారని ఏఎస్పీ పేర్కొన్నారు.