ETV Bharat / jagte-raho

తల యంత్రంలో ఇరుక్కుని కార్మికుడు మృతి

యంత్రాన్ని రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రం ఆన్ కావడం వల్ల తల అందులో ఇరుక్కుని ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

head got stuck in the machine and  worker died in jeedimetla in medchal district
తల యంత్రంలో ఇరుక్కుని కార్మికుడు మృతి
author img

By

Published : Oct 13, 2020, 8:48 AM IST

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పరిధిలో యంత్రాన్ని రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రం ఆన్ కావడం వల్ల తల అందులో ఇరుక్కుని ఓ కార్మికుడు మృతి చెందాడు. జీడిమెట్ల పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉండే శ్రీకాంత్(28).. బీరప్ప నగర్​లోని 'అన్సారీ ఈ‌ ప్యాకింగ్' అనే పరిశ్రమలో మెషీన్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. పరిశ్రమలోని యంత్రాన్ని రిపేర్​ చేస్తుండగా ప్రమాదవశాత్తు యంత్రం ఆన్​కావడం వల్ల తల అందులో ఇరుక్కుంది. తలకు బలమైన గాయ కావడం వల్ల శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎదురుగా ఉన్న మరో కంపెనీలో శ్రీకాంత్ భార్య చంద్రవతి పనిచేస్తుంది. ఆమె సంఘటనా స్దలానికి చేరుకొని తన భర్తను చూడగా అప్పటికే చనిపోయాడని తెలుసుకుని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మరణానికి కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించి తనకు న్యాయం చేయాలని, ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా పని చేయిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని‌‌ శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: మహేష్ హత్య కేసులో కాల్పుల సూత్రధారి ఎవరు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.