ETV Bharat / jagte-raho

ఫేస్​బుక్​ కేటుగాడు.. మహిళను మోసగించి...

ఫేస్​బుక్​లో ఓ మహిళను పరిచయం చేసుకుని ఆమె వ్యక్తిగత చిత్రాలను సేకరించి బెదిరింపులకు పాల్పడి లక్షలు కాజేసిన కేటుగాడు పోలీసులుకు చిక్కాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్​ పోలీసులు కేటుగాడిని కటకటాల వెనక్కి నెట్టారు.

ఫేస్​బుక్​ కేటుగాడు.. మహిళను మోసగించి...
author img

By

Published : Aug 27, 2019, 5:01 AM IST

అక్రమంగా డబ్బు సంపాదించేదుకు ఫేస్​బుక్​ ద్వారా మహిళకు గాలం వేసి లక్షలు కాజేసిన కేటుగాడిని సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన సల్మాన్ నవాబ్ కొంత కాలంగా ముంబయిలో ఉండేవాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేస్​బుక్​ని ఎంచుకున్నాడు. మహిళలను పరిచయం చేసుకుని తాను శ్రీమంతుడినంటూ మాయమాటలతో నమ్మించేవాడు. అతని బుట్టలో పడిన ఓ బాధితురాలు అతను చెప్పినట్టల్లా చేసి మోసపోయింది.

ఇలా మోసపోయింది...

గతేడాది జనవరిలో గచ్చిబౌలీలోని ఓ మహిళతో పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వాట్సాప్​లో వీడియోకాలింగ్, రహస్య చిత్రాలు, వీడియోలు పంపించుకునే వరకు వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత తనకు అత్యవసరంగా వ్యాపార నిమిత్తం డబ్బులు కావాలని అడిగాడు. పరిచయస్తుడే కదా అని బాధిత మహిళ సర్దుబాటు చేసింది. దీన్ని అలుసుగా తీసుకుని తరచూ డబ్బులు అడుగేవాడు. దీనికి బాధితురాలు నిరాకరించింది. అప్పుడు తన అసులు రంగు బయట పెట్టాడు సల్మాన్​. తన వద్ద ఉన్న బాధిత మహిళ వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. విడతల వారీగా రూ.13లక్షల వసూలు చేశాడు.

Cyber_Cheating
ఫేస్​బుక్​ కేటుగాడు.. మహిళను మోసగించి...

పాపం పండిందిలా...

పదే పదే డబ్బులు అడగడం, బెదిరింపులకు పాల్పతుండడం వల్ల బాధిత మహిళ సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: రూట్​ మార్చిన సైబర్​ నేరగాళ్లు.. జర జాగ్రత్త

TG_HYD_63_26_CYBER_CHEATING_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ నోట్- ఫీడ్ డెస్క్ వాట్సాప్ కు వచ్చింది. ‍‍ - ఫేస్ బుక్ లో మహిళను పరిచయం చేసుకొని క్రమంగా ఆమె వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడి సుమారు 13లక్షల రూపాయల వసూలు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన సల్మాన్ నవాబ్ కొంత కాలంగా ముంబయిలో నివాసం ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడిన సల్మాన్... డబ్బులు సంపాదించడానికి ఫేస్ బుక్ ను ఎంచుకున్నాడు. మహిళలను పరిచయం చేసుకొని వాళ్లను మాయమాటలతో నమ్మించాడు. శ్రీమంతుడిగా పరిచయం చేసుకొని ముంబయిలోని ఖరీదైన హోటళ్లలో ఫోటోలు దిగి వాటిని మహిళలకు పంపించాడు. ఈ క్రమంలో గతేడాది జనవరిలో గచ్చిబౌలీలోని ఓ మహిళతో పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వాట్సాప్ లో వీడియోకాలింగ్ మాట్లాడటం, రహస్య చిత్రాలు, వీడియోలు పంపించుకునే వరకు వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత తనకు అత్యవసరంగా వ్యాపార నిమిత్తం డబ్బులు కావాలని సల్మాన్ అడగడంతో బాధిత మహిళ సర్దుబాటు చేసింది. తరచూ డబ్బులు అడుగుతుండటంతో బాధితురాలు నిరాకరించింది. దీంతో సల్మాన్ తన వద్ద ఉన్న బాధిత మహిళ వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. విడతల వారీగా 13లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయినా డబ్బులు అడుగుతూనే ఉండటంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసుు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.