జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండల కేంద్రానికి చెందిన తడక శ్రీనివాస్(48) కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. గురువారం సాయంత్రం కల్లు గీస్తుండగా మోకు జారి శ్రీనివాస్ కింద పడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడు. ఆయన.. తెరాస నాయకుడిగా, గౌడ సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు. భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యులు, గీత కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని తెరాస నాయకులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి, గౌడ సంఘానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ఉప్పల్లో లారీ బీభత్సం.. ఒకరు మృతి