సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఉత్తరాది నారాయణ చారి మూడు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులు దొరక్క ఆర్థికంగా చితికిపోయిన స్వర్ణకారుల వృత్తిదారుల కోసమే తన త్యాగమని... ఇప్పటికైనా స్వర్ణకారుల స్థితిగతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని.. చనిపోయే ముందు వీడియో చిత్రీకరించి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈనెల 15న కోదాడలోని తన నివాసంలో తన మనోగతాన్ని వీడియో రూపంలో వివరించి.. కోదాడ నుంచి కూసుమంచికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. మార్గం మధ్యలో గుర్తుతెలియని విషద్రావణం తాగడం వల్ల అక్కడికక్కడే నారాయణ చారి మరణించాడు.
నారాయణ చారి చనిపోయిన రెండు రోజులకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పలు సంఘాల వారు నారాయణ చారి మృతిపట్ల సంఘీభావం వ్యక్తం చేశారు. కూసుమంచిలో ఆత్మహత్య చేసుకునేందుకు ముందు తన నివాసంలోనే ఈ వీడియో చిత్రీకరించి ఉంటారని పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: కళ్లెదుటే కొనఊపిరితో కుమారుడు.. ఫలించని తల్లి ప్రయత్నం