శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ప్యాంటు నడుము భాగంలో పేస్టు రూపంలో పసిడిని తీసుకొచ్చాడు. బంగారాన్ని ఘనరూపంలోకి మార్చగా 395.07 గ్రాములు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధరించారు.
ఈ పట్టుబడ్డ బంగారం విలువ రూ.19.98 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అరెస్టు చేశారు.
![ప్యాంటులో బంగారం అక్రమ రవాణా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10257094_img-20210115-wa0067.jpg)
ఇదీ చదవండి : రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం