సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో జులై 27న భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి కరానా సోకింది. వారంతా చికిత్స నిమిత్తం హైదరాబాద్కి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ముగ్గురు స్థానికులు... బాధితుల ఇంట్లోని 62 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు చోరీ చేశారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన స్థానిక పోలీసులు... తెలిసినవారే నేరానికి పాల్పడి ఉంటారనే కోణంలో విచారణ ప్రారంభించారు. అనుమానించినట్లుగానే అదే గ్రామానికి చెందిన వ్యక్తులపై అనుమానించారు. దర్యాప్తు జరిపి చోరీకి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించిన మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ భాస్కరన్ అభినందించారు.
ఇదీ చూడండి: వేర్వేరు చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం