ETV Bharat / jagte-raho

ట్రాఫిక్ హోంగార్డు నిజాయితీ... బంగారం అప్పగింత

ప్రస్తుత సమాజంలో రోడ్డుపై వంద రూపాయలు కనిపిస్తేనే ఠక్కున తీసుకుని జేబులో పెట్టుకుంటాం. అదే ఐదు తులాల బంగారం దొరికితే మన ఆనందానికి అవధులు ఉండవు. కానీ గచ్చిబౌలి ట్రాఫిక్ హోంగార్డు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. చివరికి పొగొట్టుకున్న వారికి అందజేసి శభాష్ అనిపించుకున్నారు.

Gold chain given to loss people in kondapur by the of traffic conistable
ట్రాఫిక్ హోంగార్డు నిజాయతీ... బంగారం అప్పగింత
author img

By

Published : Nov 5, 2020, 11:20 PM IST

హైదరాబాద్‌ కొండాపూర్‌లో విధులు నిర్వహిస్తున్న గచ్చిబౌలి ట్రాఫిక్ హోంగార్డు మల్లేశ్‌కు దొరికిన ఐదు తులాల బంగారాన్ని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు. దీనిపై నగరంలోని మూడు కమిషనరేట్లలో కేసు నమోదు కాకపోవడంతో పోలీసులు సామాజిక మాధ్యమాల్లో సమాచారం అందించారు.

దీంతో ఆ బంగారు తమదేనంటూ యూసఫ్‌గూడలోని కార్మిక్‌నగర్‌కు చెందిన మమతా, నరేందర్ దంపతులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. హఫీజ్‌పేట్‌లోని తమ అమ్మవాళ్ల ఇంటికి వెళ్లి తిరిగివస్తుండగా కొండాపూర్‌లో బస్సు ఎక్కేటప్పుడు పడిపోయి ఉంటుందని తెలిపారు. బంగారు తమకు అందేలా చేసిన హోంగార్డు మల్లేశ్‌కు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో 12 బంగారు బిస్కెట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.