ETV Bharat / jagte-raho

జీకే అన్నారం హత్య కేసులో వెలువడిన కీలక తీర్పు

నల్గొండ జిల్లా జీకే అన్నారంలో భూవివాదంలో జరిగిన హత్య కేసులో కీలక తీర్పు వచ్చింది. నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ.. జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి ఎంవీ రమేశ్ బాబు తీర్పునిచ్చారు.

జీకే అన్నారం హత్య కేసులో వెలువడిన కీలక తీర్పు
జీకే అన్నారం హత్య కేసులో వెలువడిన కీలక తీర్పు
author img

By

Published : Sep 22, 2020, 8:40 PM IST

జీకే అన్నారం హత్య కేసులో వెలువడిన కీలక తీర్పు

నల్గొండ జిల్లా జీకే అన్నారం హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. నలుగురికి జీవిత ఖైదుతో పాటు అందులో ఇద్దరికి రూ. 5 లక్షల జరిమానా విధించగా... మరో ఇద్దరికి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ మేరకు నల్గొండ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి ఎంవీ రమేశ్​ బాబు తీర్పునిచ్చారు. జీకే అన్నారం గ్రామానికి చెందిన చిర్ర మహేందర్ రెడ్డిని 2017లో మరణాయుధాలతో హత్య చేసిన చిర్రా సైదిరెడ్డి, కంచకుట్ల సైదిరెడ్డి, ఏళ్ల సతీశ్​ రెడ్డి, బోధనం వెంకట్ రెడ్డిలకు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు వివరించారు.

మృతుడి భార్య చిర్రా కల్పన ఫిర్యాదు మేరకు జూలై 7, 2017 రోజున నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. మూడు ఎకరాల 14 గంటల భూమి కొనుగోలు విషయంలో ఎర్ర సైదిరెడ్డి మృతుడు మహేందర్ రెడ్డితో తరుచుగా ఘర్షణ పడి కక్ష పెంచుకుని హత్య చేశారని తేలింది.

ఇదీ చూడండి: ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.