ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లి మండలం శానపల్లి లంక గ్రామంలో 13 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
కారులో వచ్చారు...
బాలిక తల్లిదండ్రుల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ పరిణామాలతో బాలిక తల్లి వద్ద కాకుండా.. శానపల్లి లంకలో తండ్రి వద్ద ఉంటుందని స్థానికులంటున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక రహదారిపై నడిచి వెళ్తుండగా.. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు.
ఇదీ చూడండి:ఈనెల 17తో ముగియనున్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవీకాలం