మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఘనాపూర్ గ్రామ సర్పంచ్ నానావత్ పద్మ నాయక్ మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం వల్ల వారం రోజులుగా బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పద్మనాయక్ మృతి పట్ల పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!