అనకాపల్లి నుంచి రాజస్థాన్‌కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని కాజీపేట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కి చెందిన సన్వర్ లాల్, బిలాల్ అనే ఇద్దరు యువకులు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కోణార్క్ ఎక్స్ప్రెస్ నుంచి గంజాయి బ్యాగులతో దిగిన యువకులు రాజస్థాన్ వెళ్లడానికి మరో రైలు కోసం ప్లాట్ ఫామ్‌పై వేచి ఉండాగా పోలీసులు వారిని తనిఖీ చేశారు. 14 కట్టల్లో 28 కిలోల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఇవీ చూడండి; వివాహ విందుకు వెళ్తున్న ట్రాలీ వ్యాన్ బోల్తా !!