మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎస్కే హబీబ్‌మూసా, రాజేశ్ అలియాస్ రమేశ్ కలసి గంజాయి విక్రయిస్తున్నారు. పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు తమ వద్ద గంజాయి ఉన్నట్లు ఒప్పకున్నారు.
చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అవసరం ఉన్నవారికి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మత్త మందును చాలా మంది కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చర్యలు తప్పవని ఎస్సై గంగరాజు హెచ్చరించారు.
ఇదీ చదవండి: గొల్లపల్లి లొల్లిలొల్లి: తెరాస, భాజపా వివాదం.. పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తం