ETV Bharat / jagte-raho

విద్యార్థులను పావుగా వాడుకుంటోన్న గంజాయి మాఫియా

వ్యాపార విస్తరణకు గంజాయి మాఫియా విద్యార్థులను పావులుగా ఎంచుకుంటోంది. గంజాయి అలవాటున్న వారిని విక్రేతలుగానూ మార్చుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన సరకుతో ఓ హోటల్‌లో కొందరు విద్యార్థులు దిగినట్లు సమాచారం అందుకున్న హైదరాబాద్‌ సైఫాబాద్ పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థులను పావుగా వాడుకుంటోన్న గంజాయి మాఫియా
విద్యార్థులను పావుగా వాడుకుంటోన్న గంజాయి మాఫియా
author img

By

Published : Oct 31, 2020, 11:00 PM IST

తమ వ్యాపార విస్తరణకు గంజాయి మాఫియా విద్యార్థులను పావులుగా మార్చుకుంటోంది. గంజాయి అలవాటున్న వారిని విక్రేతలుగా మారుస్తూ విద్యార్థులకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌ ఖైరతాబాద్ మారుతీనగర్‌కు చెందిన కార్తీక్, ఎల్బీనగర్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా... అదే బస్తీకి చెందిన వంశీవర్ధన్ ఇంటర్ రెండో సంవతర్సరం చదువుతున్నాడు. తుమ్మలబస్తీకి చెందిన మణికాంత్ ఘట్కేసర్‌లోని ఓ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం.. చింతలబస్తీకి చెందిన ధరమ్ దాస్ న్యూ సీఐబీ క్యార్టర్స్‌కు చెందిన మరో విద్యార్థి ఇంటర్ చదువుతున్నారు.

కార్తీక్, వంశీవర్ధన్ కలిసి మిగతా ముగ్గురి నుంచి డబ్బు వసూలు చేసి ఈ నెల 25న ఓ కారులో విశాఖపట్టణం జిల్లా అరకు వెళ్లారు. నర్సింహ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో దిగారు. ఐదుగురు కలిసి హోటల్‌లోని గదిలో గంజాయిని చిన్న ప్యాకెట్లుగా కడుతున్నారు. ఇది తెలిసి సైఫాబాద్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి.. నిందితుల నుంచి 2.7 కిలోల గంజాయి, రూ. ఐదు వేలు స్వాధీనం చేసుకున్నారు.

ganja-mafia-using-students-as-sellers-in-hyderabad
గంజాయి ప్యాకెట్లు కడుతూ దొరికిన విద్యార్థులు

చిన్న ప్యాకెట్లను కళాశాలల విద్యార్థులకు విక్రయించనున్నారని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని రిమాండ్‌కు తరలించి.. ఓ మైనార్ బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.

ఇదీ చదవండి: ఓఆర్ఆర్​పై వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.