జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన గుర్రం భాస్కర్ క్యాన్సర్ చికిత్స పొందుతుండగా.. కరోనా వైరస్ సోకింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించింది. వైద్యులు భాస్కర్ని ఇంటికి తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చిన రోజేే భాస్కర్ ప్రాణాలు విడిచాడు. అదేరోజు.. భాస్కర్ స్నేహితుడు గుర్రం రాజేందర్ పొలంలో పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు. కష్టపడి పని చేసుకుంటూ.. కలిసి మెలిసి ఉండే ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకేరోజు చనిపోగా.. చావులోనూ వారిది విడదీయలేని స్నేహమే అంటూ తోటి యువకులు, గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు. యువకులిద్దరూ ఒకేరోజు చనిపోవడం వల్ల నేరెళ్ల గ్రామం కన్నీటి సంద్రమైంది.
ఇదీ చదవండి: బుల్లితెర నటి శ్రావణి కేసులో ఆసక్తికర విషయాలు