రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రి నుంచి ఓ వ్యక్తి డిశ్చార్జి అయి సూర్యాపేట వెళ్తుండగా కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన లారీని అతివేగంతో వచ్చి మరో లారీ ఢీకొట్టగా... లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డ్రైవర్‌ను బయటకు తీశారు.
ఈ ప్రమాదం వల్ల విజయవాడ జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా... లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: బోధన్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం...రూ. 14 లక్షల ఆస్తి నష్టం!