ETV Bharat / jagte-raho

రైతన్న ఆత్మహత్యాయత్నం - సబ్​ కలెక్టర్​

ఇది వరకే భూమి కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ బొగ్గు గనుల కోసం నమ్ముకున్న భూతల్లిని త్యాగం చేస్తున్నారు. ఇంత చేసినా వారికి పరిహారం మాత్రం అందలేదు. సర్వం కోల్పోయిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగింది.

బాధితున్ని పరామర్శిస్తున్న సబ్​ కలెక్టర్​
author img

By

Published : Feb 26, 2019, 3:00 PM IST

రైతన్న ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఓపెన్​ కాస్ట్​ భూ నిర్వాసితులు 14 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించలేదని అవేదన చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతన్ని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితున్ని సబ్​ కలెక్టర్​ భావీశ్​ మిశ్రా పరామర్శించారు. భూములు కోల్పోయి రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని అన్నదాతలు వివరించారు.

బాధితుడికి ఆరు ఎకరాలు ఉంటే అందులో 3 ఎకరాల భూమికి ఇతరులకు పరిహారమిచ్చారని మనస్తాపంతో బలన్మరణానికి యత్నించాడని తెలిపారు. విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తానని సబ్​ కలెక్టర్​ రైతులకు హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:భిక్షాటనపై స్పందించిన తహసీల్దార్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.