ETV Bharat / jagte-raho

జాతీయ రహదారిపై కారు బోల్తా... అందులో మాజీ ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తాజా వార్తలు

కాంగ్రెస్​ మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తోన్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

former mla donthi madhava reddy narrowly missed the risk
మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
author img

By

Published : Jan 4, 2021, 2:32 PM IST

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హన్మకొండ- హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారు ఓ స్కూటీని ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడింది. వెంటనే కారులోని బెలూన్​లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదంలో మాధవ రెడ్డి, ఆయనతో ప్రయాణిస్తోన్న మరో వ్యక్తి, కారు డ్రైవర్​కు స్వల్పగాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడడంతో అతన్ని హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయన మరో వాహనంలో బయలుదేరి వెళ్లారు.

ఇదీ చదవండి: యూపీలో కంటైనర్ బోల్తా- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.