కుమురం భీం జిల్లా కౌటాల మండానికి చెందిన రాజా గౌడ్ అనే వ్యక్తి... చెనులో అడవి పంది చనిపోవడంతో అటవీ అధికారులు విచారణ చేపట్టారు. రాజాగౌడ్, రమేశ్, సాయి అనే వ్యక్తులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో నిందితుల వైపు నుంచి మాట్లాడేందుకు సిర్పూర్ మండలానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లారు. కేసు విషయమై మాట్లాడుతున్న క్రమంలో అధికారులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అటవీ శాఖ అధికారులు తనను గదిలోకి తీసుకెళ్లి చితక బాదారని, తనకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించాడు.
ఈ విషయమై సిర్పూర్ రేంజ్ ఎఫ్ఆర్ఓను సంప్రదించగా.. రాజా గౌడ్ కేసు విషయంలో మాట్లాడేందుకు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వచ్చాడని.. మాట్లాడుతుండగానే డిప్యుటీ రేంజ్ ఆఫీసర్‌పై కులం పేరుతో దూషిస్తూ దాడి చేశాడని తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ సైతం అటవీ అధికారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈమేరకు శ్రీనివాస్ గౌడ్ పైన, అటవీ అధికారులపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సిర్పూర్ ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో ప్రభుత్వ సమాచారం