ETV Bharat / jagte-raho

విద్యుత్​ షాక్​తో మత్స్యకారుడు మృతి

చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్​కు గురై మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా బొల్లారం మత్తడి వద్ద చోటుచేసుకుంది. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విద్యుత్​ షాక్​కు గురై మత్స్యకారుడు మృతి

author img

By

Published : Nov 18, 2020, 4:27 PM IST

మెదక్ మండలం జానకం పల్లి గ్రామానికి చెందిన మార్గం రామకృష్ణ(28) అదే గ్రామానికి చెందిన నర్సింలు, శివయ్య, శేకులుతో కలిసి బొల్లారం మత్తడి వద్దకు సోమవారం రాత్రి చేపల వేటకు వెళ్లారు. పొలానికి కరెంట్ పెట్టి బొల్లారం మత్తడి వద్ద చేపలు పడుతున్న సమయంలో మార్గం రామకృష్ణ విద్యుత్ షాక్​ తగిలి అక్కడికక్కడే మరణించాడు. అతని వెంట ఉన్న నర్సింలు, శేకులు శివయ్యలు భయపడి అక్కడినుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు.

అయితే రామకృష్ణ ఎంతసేపైన ఇంటికి రాకపోయేసరికి అతని భార్య స్వప్న, కుటుంబ సభ్యులు మెదక్​ రూరల్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నర్సింలు, శేకులు, శివయ్య బుధవారం ఉదయం పోలీస్​ స్టేషన్​కు చేరుకని జరిగిన విషయం చెప్పారు. ఎస్సై కృష్ణా రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గల్లంతైన మత్స్యకారుడిని కాపాడిన మరో మత్స్యకారుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.