ETV Bharat / jagte-raho

పెద్దంపేట సమీపంలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు - ఈటీవీ భారత్​ వార్తలు

ప్రశాంతంగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ అన్నారు. పెద్దంపేట సమీపంలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఎవరు చనిపోలేదన్నారు.

firing between police and  Maoists in jayashankar bhuapalapalli district
పెద్దంపేట సమీపంలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
author img

By

Published : Nov 11, 2020, 10:37 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్​పూర్ అడవుల్లోని పెద్దంపేటలో మావోలు వివిధ వర్గాల నుంచి చందాలు వసూలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన మవోయిస్టులు పారిపోయేందుకు యత్నించారు. మావోయిస్టులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఇరు వర్గాలకు ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలం నుంచి ఎనిమిది కిట్ బ్యాగులు, 303 రైఫిల్, వంట సామగ్రి, వాటర్ క్యాన్, మెడికల్ కిట్లు, సోలార్ లైట్​ను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ తెలిపారు. తప్పించుకున్న మావోల కోసం 20 పోలీసు పార్టీలతో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పెర్రీ పాయింట్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మావోయిస్టులు హింసకు దిగకుండా లొంగిపోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ కోరారు.

ఇదీ చదవండి: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.