సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్సిల్ కౌంటర్ సమీపంలో ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వాహనం నుంచి పెట్రోల్ తీస్తుండగా... మంటలు అంటుకొని కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గ్యాస్‌తో మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. మంటలు ఇతర వాహనాలకు వ్యాపించకుండా బైక్‌ను పక్కకు జరిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల్లో జాప్యమేంటని వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం