హైదరాబాద్ లక్డీకాపూల్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 8.30 గంటలకు ఒక్కసారిగా బ్లడ్‌బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. అక్కడే విధుల్లో ఉన్న డాక్టర్ రాజ్‌కుమార్ నాయక్ రోగులను బయటకు తీసుకెళ్లి వారి ప్రాణాలను కాపాడారు. దీనితో పెను ప్రమాదం తప్పడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.
బ్లడ్‌బ్యాంక్‌లో ఉన్న వైద్య పరికరాలు, ఏసీ వైర్లు, గదిలో ఉన్న సామగ్రి, వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో అని అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.