సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు బండ్లగూడ పారిశ్రామికవాడలోని విర్కో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 9గంటలు దాటిన తర్వాత ఉన్నట్టుండి రియాక్టర్ ఉన్న ప్లాంట్‌లోంచి మంటలు వచ్చాయి. పెద్దగా వ్యాపించిన మంటలను అదుపు చేయడానికి పటాన్‌చెరు, సంగారెడ్డి పాశమైలారం, మాదాపూర్, కూకట్‌పల్లి నుంచి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రసాయన పరిశ్రమ కావడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుక అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు కార్మికులు ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా బయటకు వచ్చారా, లేదా అనేది తెేలాల్సి ఉందని సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి అన్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు, జరిగిన నష్టంపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మే 29 వరకు లాక్డౌన్