హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాగ్ డిజైనర్ ఫ్యాబ్రిక్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో నుంచి దట్టమైన పొగలు ఎగజిమ్మడంతో అందులోని జనం భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. లేక్ వ్యూ ప్యాలెస్ సెల్లార్లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా విద్యుదాఘాతం జరిగి మంటలు లేచాయి.
చిన్నారి సురక్షితం
ఈ భవనంలోనే ఆరోహి బ్లడ్ బ్యాంక్ ఉంది. ప్రమాదసమయంలో అందులో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారికి రక్తం ఎక్కిస్తున్నారు. వెంటనే తేరుకున్న సిబ్బంది ఆ చిన్నారిని హుటాహుటిన కిందకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖాధికారులు ఘటనా స్థలికి చేరుకుని భవనంలో చిక్కుకున్న 11 మందిని బయటకు తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ మార్కెటింగ్ పేరిట రూ.7 కోట్లు వసూలు.. ముఠా అరెస్ట్