వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలో డీసీతండా సమీపంలోని వ్యవసాయ భూముల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గడ్డివాములు, పైపులు అగ్నికి ఆహుతయ్యాయి.
సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించారు. గాలులు రావడం వల్ల మంటలు సమీప తండాకు వ్యాపించాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనా స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్, ఛైర్మన్ ఆంబోతు అరుణ, మున్సిపల్ సిబ్బంది సందర్శించారు.