హైదరాబాద్ బోరబండ శ్రీరామ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫర్నీచర్ అంతా కాలి బూడిదైంది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.