కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైటెక్ మొబైల్ షాపులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపులో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంతో షాపులో ఉన్న రూ. 6లక్షల విలువైన సెల్ఫోన్లతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక సిబ్బంది పరిశీలిస్తున్నారు.
- ఇదీ చూడండి : కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు-15 మంది మృతి