కన్న తండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ వింజమూరులో వెలుగులోకి వచ్చింది. వింజమూరు పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను గురువారం ఉదయం బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అదేరోజు సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి తీసుకువస్తూ మద్యంమత్తులో మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.
కామాంధుడిలా తండ్రి కాటేస్తుంటే అతడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది బాలిక. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.బాజిరెడ్డి తెలిపారు.
- ఇదీ చూడండి: ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల