హైదరాబాద్‌లోని చింతల్ భగత్ సింగ్ నగర్లో దారుణం జరిగింది. ఓ తండ్రి తాగొచ్చిన తనయున్ని హత్య చేశాడు. స్థానికంగా నివాసంముండే పుల్లయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన ఇంట్లో వాళ్లను వేధిస్తుండేవాడు.
రోకలిబండతో
శనివారం రాత్రి తాగొచ్చిన వెంకటేశ్వర్లు ఇంటి తలుపు కొట్టాడు. తండ్రి తలుపు ఆలస్యంగా తీశాడని కోపంతో అతను తండ్రి పుల్లయ్యపై చేయి చేసుకున్నాడు. ఈ గొడవలో మరో కొడుకు శ్రీనివాస్ తమ్ముడిని కర్రతో కొట్టగా తండ్రి పుల్లయ్య రోకలిబండతో తలపై బాదాడు. తీవ్ర గాయాలైన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.