ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన రవి, జగదీశ్.. తండ్రి కొడుకులు. సోమవారం రాత్రి వాన కురవగా.. తమ పొలాన్ని చూసేందుకు వీరిద్దరు రాతోని చెరువు అలుగు మీదుగా వెళ్తున్నప్పుడు అలుగు సుమారు.. ఆరు అంగుళాల మేర ప్రవహిస్తోంది. వారు పొలం నుంచి తిరిగి వచ్చే సమయానికి ఉద్ధృతి పెరిగి తండ్రి జారి వాగులోకి పడిపోబోయాడు. ఈ క్రమంలో కొడుకు కాలు పట్టుకోగా.. ఇద్దరూ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
కొంత దూరం వెళ్లాక కుమారునికి చెట్టు ఆసరా దొరికి దాన్ని పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. రవి ఆచూకీ కోసం సత్తుపల్లి ఫైర్‌స్టేషన్ సిబ్బంది, స్థానిక యువకులు గాలించినా లాభం లేకపోయింది. జాడతెలీక రవి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండిః నిజంగా బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయా.. ?