ETV Bharat / jagte-raho

ఎమ్మెల్యే ఇంటిపైకి రాళ్లు విసిరిన రైతులు - కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ తాజా వార్తలు​

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటిపైకి రైతులు రాళ్లతో దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు... వారిని అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.

Farmers throwing stones at Korutla MLA Kalvakuntla Vidyasagar Rao house
ఎమ్మెల్యే ఇంటిపైకి రాళ్లు విసిరిన రైతులు
author img

By

Published : Oct 17, 2020, 8:55 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డివిజన్​ కేంద్రంలో రైతులు మహాధర్నా చేపట్టారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి... రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి పట్టణంలోని పాత బస్టాండు వద్ద జాతీయ రహదారిపై భైఠాయించి ధర్నాకు దిగారు.

సుమారు మూడు గంటల పైనే ఆందోళన నిర్వహించిన రైతులు... పాత బస్టాండ్ నుంచి మెట్​పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా కొందరు రైతులు... కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటిపైకి రాళ్ల దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ.... ఎమ్మెల్యే ఇంటి ముందు రైతులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.