ETV Bharat / jagte-raho

అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం - కామారెడ్డి జిల్లా నేర వార్తలు

తన రెండెకరాల పొలంలో నాలుగు బోర్లు వేయించాడు. అయినా గంగమ్మ కరుణించలేదు. దీనికి తోడు పంట దిగుబడి సరిగా రాక అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

farmer suicide in kamareddy dist with laibilities
అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం
author img

By

Published : Nov 23, 2020, 2:39 PM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన లకావత్ దేవిసింగ్ (34) అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన రెండెకరాల పొలంలో నాలుగు బోర్లు వేసినా నీరు పడకపోవంతో అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు పంట దిగుబడి రాక మానసిక వేదనకు గురయ్యాడు.

ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఇంటినుంచి బయటికి వెళ్లిన దేవిసింగ్ తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని పెద్ద భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ శ్వేతా తెలిపారు.

ఇదీ చూడండి:పెద్దలు పెళ్లికి నిరాకరించారని ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.