ETV Bharat / jagte-raho

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య - farmer suicide in lingampally kalan

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూమినే నమ్ముకుని కష్టపడుతున్న కర్షకులు... కాలం వేస్తున్న కాటుకు అదే భూమిలో బూడిదవుతున్నారు. అలాంటి మరో విషాదకర ఘటనే కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లి కలాన్​లో జరిగింది.

farmer died with  debt problems
farmer died with debt problems
author img

By

Published : Dec 6, 2020, 10:20 PM IST

అప్పుల బాధ తాళలేక మరో రైతు తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో జరిగింది. గడ్డం నారాయణ(55) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య గడ్డం వెంకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజయ్య తెలిపారు.

ఇదీ చూడండి: కొడుకులు చూస్తుండగానే తల్లి ఆత్మహత్య... కారణమేంటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.