తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో తనపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు వేసినా ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. ఎస్సాఆర్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుసుకున్న రాములు నాయక్... అనుచరులతో కలిసి స్టేషన్కు వచ్చారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు లేని కేసులు ఇప్పుడెలా వస్తున్నాయని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలపై లేనిపోని కేసులు బనాయించడం సబబు కాదని రాములు నాయక్ హితవు పలికారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానన్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ వృత్తిని నిజాయితీగా చేయాలని విజ్ఞప్తి చేశారు.