నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం మైలారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నరసింహ అనే రైతు మృతి చెందారు. పొలం వద్ద ట్రాన్స్ ఫార్మర్ దగ్గర ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. పొలానికి నీళ్లు పెడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో... తీగకు మరమ్మతు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది.
తమ పెద్దదిక్కుని కోల్పోయామని రైతు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: మిర్యాలగూడలో అనిశాకి చిక్కిన సైట్ ఇంజినీర్