ETV Bharat / jagte-raho

మైనర్​ అమ్మాయిపై నిఘా... ముగ్గురు అరెస్ట్​ - undefined

మైనర్​ బాలిక వ్యవహారశైలి తెలుసుకోవడానికి ప్రైవేట్​ గూఢచార సంస్థతో చేతులు కలిపిన వ్యక్తితో పాటు సంస్థ నిర్వాహకులను చైతన్యపురి పోలీసులు అరెస్ట్​ చేశారు.

రాచకొండ సీపీ మహేశ్​ భగవత్
author img

By

Published : Apr 3, 2019, 7:49 PM IST

Updated : Apr 3, 2019, 8:45 PM IST

మైనర్​ బాలిక వ్యవహారశైలిని తెలుసుకోవడానికి మహేశ్​ అనే యువకుడు ప్రైవేట్​ గూఢచార సంస్థతో చేతులు కలిపి రూ.17వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. హైదరాబాద్​ చైతన్యపురి సమీపంలోని ఓ కాలనీలో నివాసముంటున్న మహేశ్​కు మైనర్​ బాలికను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. బాలిక మైనర్​ అయినందున పెళ్లిని కొంతకాలం వాయిదా వేసుకున్నారు కుటుంబ సభ్యులు. బాలికపై ఇష్టం పెంచుకున్న మహేశ్​ సామాజిక మాధ్యమాల ద్వారా బాలిక ఫోన్​ నెంబర్​ సంపాదించాడు. అమ్మాయి క్యారెక్టర్​ తెలుసుకోడానికి ప్రైవేట్​ వ్యక్తుల ద్వారా నిఘా పెట్టాడు.

బహిరంగంగానే వివరాల సేకరణ..

బాలిక చదివే కళాశాల ప్రాంగణంలో బహిరంగంగానే బాలిక వివరాలు సేకరించడం గమనించిన ప్రిన్సిపల్​ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కొందరు వ్యక్తులు తన కూతురిపై నిఘా పెట్టారని పోలీసులను ఆశ్రయించాడు ఆ తండ్రి. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్​ చేశారు. నకిలీ డిటెక్టివ్ సంస్థలను నమ్మవద్దని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ విజ్ఞప్తి చేశారు. మహిళలు, బాలికలపై ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

రాచకొండ సీపీ మహేశ్​ భగవత్

ఇవీ చూడండి:ఉప్పల్​లో 13 లక్షల విలువైన గుట్కా పట్టివేత

Intro:HYD_TG_44_03_MLKG_CP_PC_AB_C14
contributor: satish_mlkg, 9394450282, 9985791101

యాంకర్: రాచకొండ కమిషనరేట్ పరిధి చైతన్యపురి లో మైనర్ బాలికపై మహేష్ అనే యువకుడు ప్రైవేట్ గూడచారి సంస్థ తో చేతులు కలిపి వారికి 17 వేల రూపాయలు తో ఒప్పందం కుదుర్చుకుని ఆ బాలిక రోజు వారి శైలి పై నిఘా పెట్టాలని సూచించాడు. నిఘా పెట్టిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఒకే కాలనీకి చెందిన మహేష్మరియు మైనర్ బాలిక. అ బాలిక ను వివాహం చేసుకొవడానికి బాలిక తండ్రి తో ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో బాలిక మైనర్ కావడంతో వాయిదా వేసిన తండ్రి. బాలిక పై ఇష్టం పెంచుకొని సోషల్ మీడియా ద్వారా దగ్గరవడానికి తన వ్యక్తిగత నెంబర్ సంపాదించి, బాలిక క్యారెక్టర్ తెలుసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిఘా పెంచడంతో, తన కూతురి పై ఎవరో కొందరు వ్యక్తులు నిఘా పెట్టారని పోలీసులను ఆశ్రయించిన తండ్రి, కేసు నమోదు చేసి విచారణ జరిపి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు ఎటువంటి ఇటువంటి ఇ నకిలీ డిటెక్టివ్ సంస్థలను నమ్మవద్దని మహిళలు బాలికలపై ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాచకొండ కమిషనర్.

బైట్: మహేశ్ భగవత్ (రాచకొండ కమీషనర్)

Body:సీపీ

Conclusion:సీపీ
Last Updated : Apr 3, 2019, 8:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.