ETV Bharat / jagte-raho

నకిలీ పోలీసుల అరెస్ట్.. రూ.33 వేలు స్వాధీనం​

author img

By

Published : Aug 29, 2020, 8:04 PM IST

పోలీసులమని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 33 వేల నగదు, 4 చరవాణులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

fack  police arrested in yadadri bhuvanagiri distirct
నకిలీ పోలీసుల అరెస్ట్.. రూ.33 వేలు స్వాధీనం​

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని మచ్చుపహాడ్​లో రెండు రోజుల క్రితం పీడీఎఫ్ బియ్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. జనగామ జిల్లా బచ్చనాపేట మండలం గోపాల్​నగర్ చెందిన ఐదుగురు వ్యక్తులు కొడవటుర్ కామన్ వద్ద వారి వాహనాన్ని ఆపారు. పోలీసులమని పరిచయం చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని కేసు నమోదు చేస్తామని బెదిరించారు.

50 వేలు డిమాండ్ చేశారు. భయపడిన బాధితులు రూ.35 వేలు చెల్లించారు. ఇంకా కావాలని డిమాండ్ చేయటంతో మరో 10 వేలు తెలిసిన బంధువులను అడిగి గూగుల్ పే ద్వారా చెల్లించారు. అనంతరం పోలీసులు ఎందుకు ఇలా చేశారని విచారించగా వాళ్లు నకిలీ పోలీసులని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు చెన్నయ్య, మధుకృష్ణ, మహేందర్, కరుణాకర్, నరేశ్​ అరెస్ట్​ చేశారు. వారి నుంచి 33 వేల నగదు, 4 చరవాణులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.