ఏపీలోని ప్రకాశం జిల్లాలో నేరగాళ్లు ఏకంగా పోలీసు శాఖనే వాడుకుంటున్నారు. అద్దంకిలో ఎస్సైగా చేస్తున్న మహేశ్ ఫొటోను పెట్టుకుని ఫేస్‌బుక్‌లో కొత్తగా ఖాతా తెరిచాడో దుండగుడు. అతని ఫేస్‌బుక్‌లో ఉన్న స్నేహితులతో మెసెంజెర్‌లో చాటింగ్ చేశాడు. పరిచయం పెరిగాక.... తనకు అత్యవసరంగా డబ్బులు అడిగేవాడని పోలీసులు తెలిపారు.
ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఎస్సై మహేశ్.... వారిని అప్రమత్తం చేశారు. అది తన ఫేస్‌బుక్ అకౌంట్ కాదని నేస్తాలకు తెలియజేశాడు. అలాగే పోలీసులు విచారణ చేయగా.... నెల్లూరు జిల్లాలో మరో ఇద్దరు ఎస్సైల పేరుతో.... ఆ అపరిచిత వ్యక్తులు కొత్త రకం మోసం చేస్తున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్